సిరిపురంలో ధనుర్మాస ఉత్సవాలు

సిరిపురంలో ధనుర్మాస ఉత్సవాలు

NLG: నడిగూడెం మండలం సిరిపురం శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం గోదాదేవి అమ్మవారికి కుంకుమ సహస్రనామార్చన, తిరుప్పావై సేవాకాలం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 14న గోదా కళ్యాణంతో ఉత్సవాలు ముగియనున్నట్లు అర్చకులు వి. చక్రధరాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ టి. రమేష్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.