చెత్త సేకరణను పరిశీలించిన MPDO

చెత్త సేకరణను పరిశీలించిన MPDO

VZM: బొబ్బిలి MPDO పి.రవికుమార్‌ ఇవాళ స్థానిక దిబ్బగుడివలసలో చెత్త సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌ అంబాసిడర్లకు చెత్త ఇచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఇంటింటి నుంచి స్వికరిస్తున్న చెత్తను సంపద కేంద్రానికి తరలించాలని గ్రీన్‌ అంబాసిడర్లను ఆదేశించారు. ఆయనతో పాటు డిప్యూటీ ఎంపీడీవో భాస్కరరావు పాల్గొన్నారు.