అణగారిన వర్గాలకు జగజ్జీవన్ రామ్ జీవితం అంకితం
SKLM: అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాబూ జగజ్జీవన్ రామ్ అని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు సీతారాం పేర్కొన్నారు. ఎచ్చెర్ల మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని సీతారాం ఆదివారం సందర్శించారు. ఆయన 119వ జయంతి సందర్భంగా మహనీయుడు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.