RTC బస్సు ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు
ప్రకాశం: సింగరాయకొండలోని బాలాజీ నగర్ ఆర్టీసీ బస్సు ఓ యువకుడిని ఢీకొట్టడంతో బస్సు ముందుభాగంలో ఉన్న బంపర్‌లో కాళ్లు ఇరుక్కుపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెల్డింగ్ మిషన్ సహాయంతో ఆర్టీసీ ముందు భాగం తొలగించి యువకుడిని బయటకుతీశారు. 2 కాళ్లు బాగా దెబ్బతిని తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.