గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

JGL: బీర్పూర్ మండలం తుంగూర్ నుండి కండ్లపెల్లి గ్రామాల మధ్య శుక్రవారం రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోడ్డు పెద్ద వాగు వద్ద తెగిపోవడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం మళ్లీ రోడ్డు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.