చిత్తూరు PS ముందు వైసీపీ నాయకుల నిరసన

చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి శుక్రవారం రాత్రి నిరసనకు దిగారు. పట్టణంలోని కొంగారెడ్డిపల్లిలో నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు మురళీ రెడ్డిపై శుక్రవారం కొందరు దాడి చేశారు. డీఎస్పీ సాయినాథ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.