రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం రద్దు
NLR: రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వై. ఓ. నందన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దిత్వా తుఫాను కారణంగా సోమవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.