ఆక్రమణలు తొలగించండి: నగరపాలక సంస్థ కమిషనర్

తిరుపతిలోని ఉపాధ్యాయ నగర్ రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా వచ్చిన వినతులను శనివారం అధికారులతో కలిసి ఉపాధ్యాయ నగర్ ప్రాంతాలను సందర్శించి సీసీ రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్ మౌర్య ఆదేశించారు.