జాతీయస్థాయికి వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంపిక
KNR: కేశవపట్నం (M) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజ్కుమార్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆయన అఖిల భారత పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 21 నుంచి ఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. ఆయనకు అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.