రేపు రాజమండ్రిలో బీజేపీ వారధి కార్యక్రమం

రేపు రాజమండ్రిలో బీజేపీ వారధి కార్యక్రమం

E.G: జిల్లాలో బీజేపీ వారధి కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద బీజేపీ జిల్లా కార్యాలయంలో జరగనుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి నెలా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.