స్కూల్లో విద్యార్థికి పాము కాటు

స్కూల్లో విద్యార్థికి పాము కాటు

ADB: బేలా మండలంలోని సిర్సన్న గ్రామ ప్రైమరీ స్కూల్ మైదానంలో బుధవారం 8వ తరగతి విద్యార్థి అనూష్ క్రికెట్ ఆడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. బంతి కోసం మైదానం పరిసరాల్లోకవి వెళ్లినపుడు అతని చేతిపై పాము కాటేసింది. వెంటనే గమనించిన స్కూల్ సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. అనిల్, రిషి కుమార్ అనే సిబ్బంది బాలుడిని రిమ్స్‌కు తరలించారు.