'మత్స్యకార కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ'
E.G: రాజమండ్రి కోటిలింగాల పేటలోని 145 మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులైన 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, లీటరు నూనె ప్యాకెట్, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, అర్బన్ తహసీల్దార్ తదితరులతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం అందజేశారు. తుపాను ప్రభావం వల్ల అధికార యంత్రాంగం వేటను నిషేధించింది. దీంతో ఇంటికే పరిమితమైన మత్స్యకార కుటుంబాలకు ఆయన అందజేశారు.