VIDEO: ఆకట్టుకున్న ఆదివాసి నృత్యం
NGKL: కల్వకుర్తిలో బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జరుగుతున్న పిల్లల జాతర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలబాలికల ఆదివాసి దుస్తులను ధరించి, వారి దినచర్యను నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.