CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గంలో నిర్వహించిన ప్రజా వేదికలో 24 మంది బాధితులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గురువారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. రూ. 30 లక్షల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. ప్రభుత్వ సహకారంతో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట వరమని కొనియాడారు.