గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది: మురళినాయక్

MHBD: కంబాలపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మండలం కంబాలపెల్లి గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.