'హెల్మెట్ ధరించండి .. ప్రాణాలను కాపాడుకోండి'

NDL: నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్లో సోమవారం సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని ఆదేశాల మేరకు సోషల్ వర్కర్ డి.శోభారాణి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేశారు.