'అఖండ 2' విడుదలకు మార్గం సుగమం!
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం అఖండ-2. ఈ మూవీ విడుదలపై కొన్ని గంటలుగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సమస్యలన్నీ పరిష్కారమైనట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని సమాచారం. శుక్రవారం ఉదయం 8 గంటల షోతో బాలయ్య అభిమానుల సందడి ప్రారంభం కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.