జన్మభూమి జంక్షన్ వద్ద వీరంగం చేసిన యువకులు అరెస్టు

జన్మభూమి జంక్షన్ వద్ద వీరంగం చేసిన యువకులు అరెస్టు

వరంగల్ నగరంలో జన్మభూమి జంక్షన్ వద్ద బీర్ సీసాలతో రోడ్ మీద వీరంగం చేసి స్థానికులను భయాందోళనకు గురి చేసిన ఆకతాయిలను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారిని సోమవారం తాహసీల్దార్ ఇక్‌బాల్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఇన్‌‌స్పెక్టర్ బొల్లం రమేష్ తెలిపారు. రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.