'ఉద్యోగులు సమయపాలన పాటించాలి'

'ఉద్యోగులు సమయపాలన పాటించాలి'

NLR: సీతారామపురం బిట్‌వన్ సచివాలయాన్ని గురువారం ఇంఛార్జ్ ఎంపీడీవో చంద్రశేఖర్ పరిశీలించారు. పలు రికార్డులను రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.