సీఎం సహాయనిధి చెక్కు అందజేత
AKP: పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన దగ్గుపల్లి లక్ష్మికి సీఎం సహాయనిధి రూ.42,292 మంజూరైంది. అనారోగ్యంతో చికిత్స తీసుకున్న లక్ష్మికి హోం మంత్రి వంగలపూడి అనిత సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబాబు తెలిపారు. చెక్కును కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు.