'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

SRCL: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం సూచించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో విజయలక్ష్మి గ్రామైఖ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. రైతులందరూ మహిళలు ఏర్పాటుచేసిన ఎరువులు విత్తనాలు తీసుకోవాలన్నారు.