చిల్ల చెట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ నుంచి శివనగర్ కాలనీలోకి వెళ్లే మార్గంలో రహదారిని చెల్ల చెట్లు కమ్ముకోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. చిల్ల చెట్ల దట్టంగా ఉండడంతో విషసర్పాలు సంచరిస్తుండడంతో ప్రజలు ఆ మార్గంలో వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు చెట్ల తొలగింపు చేపట్టాలని కోరుతున్నారు.