VIDEO: రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే
ప్రకాశం: బేస్తవారిపేట మండలం అక్కపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఏవైనా సందేహాలు ఉంటే తమ సమీపంలోని రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చిరంజీవి పాల్గొన్నారు.