తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా

ELR: వేలేరుపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి కారం దారయ్య మాట్లాడుతూ.. భవన నిర్మాణం సంక్షేమ వెల్ఫేర్ బోర్డును వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిందని, కాబట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలన్నారు