విశాఖలో ఎస్సైలు బదిలీ : సీపీ

VSP: సిటీలో నలుగురు ఎస్సైలను బదిలీచేస్తూ ఇవాళ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి ట్రాఫిక్ ఎస్సైగా ఉన్న చిరంజీవిని ఎంవీపీ ట్రాఫిక్ ఎస్సైగా, ఎంవీపీలో ట్రాఫిక్ ఎస్సైగా పనిచేస్తున్న కనకరావును ఆరిలోవ ట్రాఫిక్ ఎస్సైగా, వీఆర్లో ఉన్న మురళీ కృష్ణను సీసీఆర్బీలో నియమిస్తూ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.