CBNను సీఎంగానే భరించలేకపోతున్నాం: జగన్
AP: మాజీ సీఎం జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మాట్లాడుతూ.. CM చంద్రబాబు ఉప ప్రధాని అవుతారని వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటనీ జగన్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. 'ఆయన్ను సీఎంగానే భరించలేకపోతున్నాం, ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఏమైపోవాలి' అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.