'నకిలీ డాక్టర్లు, ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి'

SRPT: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ డాక్టర్లు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.