ట్రాలీ ఆటోలో విద్యార్థుల తరలింపుపై విమర్శలు

ట్రాలీ ఆటోలో విద్యార్థుల తరలింపుపై విమర్శలు

SDPT: జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు విద్యార్థులను గూడ్స్ ట్రాలీఆటోలో తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్దూర్ మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఇలా కిక్కిరిసిన ఆటోలో పంపించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తూ, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.