పిల్లల్లో గవద బిళ్ళలు ... టీకా తప్పనిసరి..!

పిల్లల్లో గవద బిళ్ళలు ... టీకా తప్పనిసరి..!

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చిన్న పిల్లలకి గవదబిల్లల కేసులు వస్తున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ డా.శంకర్ పలు సూచనలు చేశారు. ఇందులో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చెంపల వాపు గొంతు నొప్పి లక్షణాలుంటాయని, చికిత్స అనంతరం 99 శాతం మంది కోలుకుంటున్నట్లు తెలిపారు. వ్యాధి సోకి తగ్గిన తర్వాత రెండు నెలల్లో తప్పనిసరిగా MMR టీకా ఇప్పించాలన్నారు.