తిరుపతిలో మహిళకు జైలు శిక్ష
తిరుపతిలోని జీవకోనకు చెందిన పి.ముని రాజా వద్ద 2021లో శివజ్యోతి నగర్‌కు చెందిన ఎం.పద్మావతి రూ.9 లక్షలు అప్పు తీసుకుంది. 2022లో అతనికి రూ.9 లక్షల చెక్కు ఇవ్వగా, బౌన్స్ అయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. నేరం నిరూపణ కావడంతో పద్మావతికి 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.