నేడు వరంగల్‌కి పద్మశ్రీ బ్రహ్మానందం

ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ, డా.బ్రహ్మానందం నేడు వరంగల్ మహా నగరానికి రానున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( NIT) వరంగల్ ప్రతిష్ఠాత్మక వార్షిక సాంస్కృతిక మహోత్సవమైన స్ప్రింగ్ స్క్రీ- 2025 వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల NIT ఉన్నతాధికారులు బ్రహ్మానందంను ఆహ్వానించారు.వారి ఆహ్వానం మేరకు బ్రహ్మానందం వస్తున్నారు.