గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్టు
MNCL: బెల్లంపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు 1 టౌన్ CI శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన పట్టణానికి చెందిన ఖలీమ్, రాజేష్ అనే ఇద్దరు యువకులును క్షుణ్ణంగా తనిఖీ చేయగా వారి వద్ద 1,030 గ్రాముల గంజాయి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.