VIDEO: దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

SRD: న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు ఆదివారం పర్యటించారు. మండల పరిధిలోని చీకూర్తి, చాల్కి తదితర గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, పాఠశాల భవనాలు, పంట పొలాలను పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంటలపై నష్టం అంచనా వేయాలని, రోడ్లకు మరమ్మత్తు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.