ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన కమిషనర్

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు విభాగాలను పరిశీలించారు. రోగుల వార్డులను పరిశీలించి, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.