ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వీఎస్ టి ఇండస్ట్రీస్, మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీనిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ ఏ శ్రీ రాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.