ఇవాళ, రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని బుధవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.