మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్న భర్త
MDK: భార్యా, భార్యాల మధ్య మనస్పర్థలతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌడిపల్లి (M) తునికిలో ఇవాళ జరిగింది. గ్రామానికి చెందిన చైతన్య (24) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. హత్నూరకు చెందిన స్వాతిని రెండేళ్ల కిందట వివాహం చేసుకుని ఇల్లరికం వెళ్లాడు. ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా.. తన అమ్మమ్మ ఇంటికి వెళ్లొస్తానని గ్రామ శివారులోని బావి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.