డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నిరసన

ADB: గత ప్రభుత్వంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు ఇవ్వడం లేదని భైంసాకు చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా నిరుపేదలైన మాకు డ్రా ద్వారా ఇళ్ల కోసం ఎంపిక చేసినప్పటికీ తమకు ఇళ్ల కేటాయించలేక పోతున్నారని వాపోయారు. వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.