సీతంలో డా. నీలిమకు ఘన సత్కారం
VZM: 'వరల్డ్ ఐపీ డే-2026’ అంతర్జాతీయ వీడియో పోటీలో భారతదేశానికి చెందిన డా. నీలిమ రూపొందించిన ‘కలరిపయట్టు’ వీడియో టాప్-20లో స్థానం సంపాదించింది. భారతదేశపు ప్రాచీన యుద్ధకళ ‘కలరిపయట్టు’ను మేధో సంపత్తి హక్కుల ద్వారా ఎలా పరిరక్షించుకోవచ్చో ఈ వీడియోలో ఆమె ప్రతిపాదించారు. ఈ విశిష్ట సాధనను గుర్తిస్తూ సీతం డైరెక్టర్ శశి భూషణరావు, డా. నీలిమను ఘనంగా సత్కరించారు.