ఉగాది పురస్కారాలకు ఎస్పీకి ఆహ్వానం

అన్నమయ్య: రాయలసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉగాది పురస్కారాలు అందివ్వడానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు మార్చ్ 30వ తేదీ రాజంపేటకు రానున్నట్లు రాయలసీమ కళా పీఠం అధ్యక్షుడు టి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం రాయచోటిలో ఎస్పీని కలిసి ఆహ్వానించారు. తరువాత ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.