సినీ హీరో రాజ్ తరుణ్‌ను కలిసిన రాయదుర్గం యువకుడు
ATP: రాయదుర్గం పట్టణానికి చెందిన చాణిక్య అనే యువకుడు సినీ హీరో రాజ్ తరుణ్‌ను కలిసి రాయదుర్గంలో ప్రసిద్ధిగాంచిన దశబుజ వినాయకుడి విశిష్టతను వివరించాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఓ సమావేశానికి విచ్చేసిన హీరోను చాణిక్య మర్యాదపూర్వకంగా కలిశాడు. దసభుజ వినాయకుడి ప్రతిమను అందించి విశిష్టతను వివరించారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని రాజ్ తరుణ్ తెలిపారు.