ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: వసంత నవరాత్రుల సందర్భంగా జిల్లాలోని శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.