15 రోజుల్లో 214 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్

RR: రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్‌టీజర్లపై కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వచ్చిన 228 ఫిర్యాదుల మేరకు 214 మంది(మేజర్స్ 94, మైనర్స్ 120)ని పట్టుకున్నారు. వీరందరికి ఎల్బీ నగర్ CP క్యాంప్ ఆఫీసులో, కౌన్సిలర్ల సమక్షంలో వారి కుటుంబ సభ్యులతో కౌన్సెలింగ్ చేపట్టారు.