VIDEO VIRAL: హైదరాబాద్ చాలా సేఫ్
TG: హైదరాబాద్‌లో మహిళల భద్రతపై ఓ యువతి పంచుకున్న అనుభవం SMలో వైరల్ అవుతోంది. ఉద్యోగ రీత్యా నగరానికి వచ్చిన లీషా.. ఒకరోజు రాత్రి 11 గంటలకు తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. 'రాత్రిపూట ఒంటరిగా 4 కిలోమీటర్లు నడిచాను. ఈ సమయంలో నాకు ఎలాంటి వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు ఎదురుకాలేదు' అని ఆమె తెలిపారు.