క్షతగాత్రుల చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు
కర్నూలు: చిన్నటేకూర్ బస్సు ప్రమాదంలో గాయపడిన వారి కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆర్డీవో సందీప్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో అధికారులు సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించగా వారిని కర్నూలు కమిషనర్ విశ్వనాథ, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ పరామర్శించారు.