బొర్రా గుహలకు ఒక్కరోజే మూడు లక్షల ఆదాయం
ASR: అరకు మన్యంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు, కార్తీకమాసం కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. మంగళవారం ఒక్క రోజే సుమారు 2,500 మంది పర్యాటకులు సందర్శించగా, గుహల ద్వారా సుమారు రూ.3 లక్షల ఆదాయం వచ్చినట్లు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.