విధుల్లో నిర్లక్ష్యం.. 11 మంది సిబ్బందికి షోకాజ్ నోటీస్

విధుల్లో నిర్లక్ష్యం.. 11 మంది సిబ్బందికి షోకాజ్ నోటీస్

MNCL: బెల్లంపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయంలోని రికార్డులు, హాజరు రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. విధులకు గైర్హాజరైన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 11 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను గురువారం ఆదేశించారు.