రేపు జిల్లాకు ఎమ్మెల్సీ నాగబాబు రాక

రేపు జిల్లాకు ఎమ్మెల్సీ నాగబాబు రాక

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రానున్నట్లు పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. జిల్లాలోని పలువురు జనసేన ముఖ్యనాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో నాగబాబు సమావేశం కానున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులకు సమావేశానికి హాజరుకావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు పీ.చంద్రమోహన్ తెలిపారు.