హైడ్రా'తో గండిపేట్‌లో 2 కాలనీలకు రోడ్డు మార్గం

HYD: గండిపేట మండలంలోని నెక్నాంపూర్ విలేజీలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద దాదాపు 800ల గజాల్లో కబ్జాదారులు నిర్మించిన అడ్డుగోడను మంగళవారం హైడ్రా తొలగించింది. దీంతో శ్రీ వేంకటేశ్వర కాలనీకి, ఉస్మానియా కాలనీకి మధ్య అనుసంధానం ఏర్పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయాన్ని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.