నేడు రామయ్య సన్నిధికి రేవంత్ దంపతులు
TG: సీఎం రేవంత్ దంపతులు ఇవాళ భద్రాచలాన్ని సందర్శించనున్నారు. శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వారు సమర్పించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో భద్రాద్రిలో అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.